పులి - బాటసారి-Puli - Batasari | Telugu Neethi Kathalu

శివపురం అనే గ్రామంలో రామశర్మ అనే బ్ర్రాహ్మణుడు ఉండేవాడు. అతను ఆ చుట్టుప్రక్కల ఉన్న నాలుగైదు గ్రామాలకు పురోహితుడు. ఒకనాడు పొరుగున ఉన్న కృష్ణాపురంలో వ్రతం చేయించటానికి బయలుదేరాడు. రామాపురం నుంచి కృష్ణాపురం వెళ్ళటానికి మధ్యలో రెండు మైళ్ళ దూరం అడవిని దాటి చేరుకోవాలి. ఆ అడవిలో కౄర జంతువులు లేకపోవటం వల్ల రామాపురం గ్రామస్థులు భయం లేకుండా అడవిని దాటి వెళ్ళేవారు. రామశర్మ అడవిలో నడుస్తుండగా అతనికి ఒక చెరువు గట్టు మీద దర్భలు చేతిలో పట్టుకుని కూర్చున్న పెద్దపులి కనిపించింది. దానిని చూడగానే రామశర్మ గుండెల్లో రాయి పడింది. భగవంతుడా! 'ఈ అడవిలో కౄర జంతువులు ఉండవు కదాని ఒంటరిగా బయలుదేరాను... ఇప్పుడు ఈ పెద్దపులి కనిపించింది. దీని బారి నుంచి నన్ను నువ్వే కాపాడాలి' మనసులో దేవుడిని తలచుకుంటూ అనుకున్నాడు. ఆ సమయంలోనే ఆ పెద్దపులి రామశర్మ చూడనే చూసింది. రామశర్మ కాళ్ళు చేతులు భయంతో వణికాయి. ఓ! బ్ర్రాహ్మణుడా నన్ను చూసి భయపడకు. కౄర జంతువయినా... ఇప్పుడు మాంసాహారిని కాదు... ఇప్పటిదాకా చేసిన పాపాల నుండి విముక్తి పొందాలని భగవంతుడిని ప్రార్దించాను... దేవుడు ప్రత్యక్షమయ్యి ఈ కంకణం ఎవరికైనా దానం చేస్తే నా పాపాలు పోతాయని చెప్పాడు. అందుకే నువ్వు ఈ కంకణం తీసుకో అంటూ తన చేతిలో ఉన్న కంకణాన్ని రామశర్మ చూపించింది. అది నవరత్నాలు పొదిగిన బంగారు కంకణం. చెట్ల ఆకుల్లోంచి పడుతున్న సుర్యుడి వెలుగుకి ధగధగా మెరుస్తోంది. దాన్నిచూడగానే రామశర్మ మనసులో ఆశ పుట్టింది .
నువ్వు పులివి, కౄర జంతువువి కూడా. నీ మాటలను నేను ఎలా నమ్మాలి. భలేవాడివే నువ్వు! నేను నిజంగా కౄర జంతువునే అయితే నువ్వు కనిపించగానే నిన్ను చంపి నీ మాంసంతో విందు చేసుకునే దానిని, కానీ ఈ బంగారు కంకణం తీసుకుపో అంటూ ఎందుకు చెప్పేదానిని అంది పెద్దపులి.


 రామశర్మ ఆ మాటలకు తృప్తి పడ్డాడు, నిజమే... పులి కౄర జంతువే కనుక అయితే అది కనిపించగానే తను పారిపోయినా వెంటాడి చంపి ఉండేది. అలా చెయ్యలేదు కనుక ఇది పాపాల నుండి విముక్తి కోసం తాపత్రయం పడుతూ ఉండి ఉంటుంది. రామశర్మ మనసులో భయం పోయి ఆ బంగారు కంకణం ఇటు విసురు, అది తీసుకుని నిన్ను ఆశీర్వదించి నా దారిన నేను పోతాను. నీకు పాప విముక్తి కలుగుతుంది అని చెప్పాడు. దానికి ఆ పెద్దపులి నవ్వి భలే బ్రాహ్మ ణుడివయ్యా నువ్వు... శాస్త్రాలు చదివావు అని అందరికీ చెబుతావు... నువ్వు మాత్రం వాటిని పాటించవా... ఏదన్నా దానం తీసుకునేటప్పుడు స్నానం చేసి ఆ దానం తీసుకోవాలి కదా..! అందుకే నేను దానం తీసుకునేవాళ్ళకి శ్రమ లేకుండా ఈ చెరువు ప్రక్కన కుర్చున్నాను. నువ్వు స్నానం చేసివచ్చి ఈ బంగారు కంకణం నా దగ్గర నుంచి దానంగా తీసుకుని నన్ను ఆశీర్వదించు అంది.

రామశర్మ ఆ మాటకి సరే! అలాగే అంటూ స్నానం చెయ్యటానికి చెరువులోకి దిగబోయాడు మెత్తగా ఉన్నచెరువు గట్టున బురదనేలలోనడుంవరకు దిగబడిపోయాడు అతను. అది చూసిన పులి అయ్యయ్యో ! బురదలో దిగబడి పోయావా..? ఉండు రక్షిస్తాను అంటూ తన కూర్చన్న చోటు నుంచి తాపీగా లేచి వచ్చి ఒడ్డున నిల్చుని రామశర్మ కంఠం దొరకపుచ్చకుని అతన్ని చంపి మాంసంతో విందు చేసుకుంది.


చూశారా..! దురాశ దు:ఖానికి చేటు. బంగారు కంకణానికి ఆశపడి రామశర్మ పులిచేతిలో ప్రాణాలను పోగొట్టుకున్నాడు. అందుకే ఎదుటివాళ్ళు చూపించే కానుకలకు ఎప్పుడూ ఆశపడరాదు. ఎవ్వరూ విలువైన వస్తువులను ఉచితంగా ఇవ్వరు అన్న సంగతి తెలుసుకుని దురాశకు పోరాదు.

రాజు – సోమరి ప్రజలు - Raju-somari Prajalu | Telugu Neethi Kathalu

అనగనగా ఒక ఊరిలో విక్రముడు అనే రాజు ఉండేవాడు. ఆయన ప్రజలను కన్నబిడ్డల్లా చూసేవాడు. కానీ ఆ రాజ్యంలో ప్రజలు ఎక్కువమంది సోమరులుగా తయారయ్యారు. కనీసం వారి పనిని కూడా వారుచేసుకొనే వారు కాదు. చిన్న చిన్న పనులను కూడా రాజుగారి భటులే చేయలనుకోనేవారు. ఎవరికి వారు మనకెందుకులే! అనుకొనేవారు. వాళ్ళకు గుణపాఠం నేర్పాలని రాజు ఆ నగరంలో నాలుగు రోడ్ల కూడలిలో ఒక పెద్ద రాయిని రాత్రికి రాత్రి పెట్టించాడు.
మర్నాడు ఉదయం ఒక రంగయ్య అనే వ్యాపారి తన మిత్రుడితో కలిసి బండి మీద వెళుతున్నాడు. ఆ నాల్గు రోడ్ల కూడలిలో రాయి ఉండటం చేత బండి అతి కష్టం మీద రాతిని ఆనుకొని మలుపు తిరిగింది. "బండివాడి చేత ఆ రాయిని పక్కకు నెట్టించక పోయావా?" అన్నాడు మిత్రుడు. "నాకేం పని అది ప్రభుత్వం వారు చూసుకోవాలి" అని సమాధానం చెప్పాడు వ్యాపారి. ఇంతలో ఒక గుఱ్ఱపు రౌతు ఆ రాయిని దాటుతుండగా గుఱ్ఱం కాలుకు దెబ్బ తగిలింది. రౌతు విక్రముడుని తిడుతూ గుఱ్ఱాన్ని ముందుకు నడిపించుకుంటూ వెళ్ళాడు.


కొంతసేపటికి ఒక రైతు భుజం మీద నాగలితో అక్కడికి వచాడు. దారికి అడ్డంగా ఉన్న రాయిని చూసి నాగలి దించి దాన్ని పక్కకు నెట్టడానికి ప్రయత్నించాడు. కానీ అది జరగలేదు. సాయంగా ఆ వెళ్తున్న మరొక వ్యక్తిని పిలిచాడు. అతడు"నేను గురువును. కూలి పనివానిని కాదు. అయినా నేను బుద్ధిబలం చూపిస్తాగానీ భుజబలం చూపించను" అంటూ ముందుకు వెళ్ళిపోయాడు. ఎవరిని పిలిచినా ఇంతేనని ఎలాగైనా ఆ రాతిని పక్కకు దోర్లించాలని నడుం బిగించి పూర్తి నమ్మకంతో అతి కష్టం మీద రాయిని ఓ మూలకు దొర్లించాడు. ఆ రాయి కింద డబ్బు సంచి దొరికింది. ఆశ్చర్యంతో మూట విప్పి చూశాడు రైతు. అందులో "రాయిని తొలగించిన వారికి రాజుగారి బహుమతి" అని ఉత్తరం కూడా ఉంది. రైతు ఎంతో ఆనందించాడు. ఈ వార్త ఆ నోటా ఈ నోటా దేశం అంతా వ్యాపించింది. రాజ్యంలోని ప్రతి వ్యక్తి తన వంతుగా సహాయ సహకారాలు అందజేయటం మొదలు పెట్టారు. కొంతకాలం గడిచేసరికి ఎవరిపని వాళ్ళు చేసుకోవటంలో తృప్తి ఏమిటో వాళ్ళకు తెలిసింది.

రైతు -బంగారు గుడ్డు| Raitu-Bangaru Guddu | Telugu Neethi Kathalu

ఒక ఊరిలో రంగయ్య అనే పేద రైతు ఉన్నాడు. అతను ఒక బాతు పిల్లను తెచ్చి పెంచాసాగాడు. ఆ బాతు పిల్ల పెరిగి పెద్దదైంది. ఒకరోజు అది ఒక బంగారు గుడ్డును పెట్టింది. రంగయ్య ఆనందానికి అంతులేదు. అలా ఆ బాతు రోజుకొక బంగారు గుడ్డు చోపున ప్రతి రోజు క్రమం తప్పకుండా పెడుతూ ఉన్నది. రంగయ్య రోజూ బంగారం లభించడంతో ఆనందంతో వళ్ళు మరచిపోయాడు. గొప్ప ధనవంతుడయ్యాడు . అతనికి దురాశ కలిగింది. ఒక రోజు రంగయ్య "ఈ బాతు ప్రతిరోజూ ఒక్క బంగారు గుడ్డే పెడుతుంది కదా! దీని పొట్టలో చాల బంగారు గుడ్లు ఉంటాయి.

 ప్రతి రోజూ ఒక్కొక్క బంగారు గుడ్డు కోసం వేచి చూడటం కంటే ఆ బాతును కోసి, దాని పొట్టలోని గుడ్లన్నీ ఒకేసారి తీసుకుంటే మంచిది" అని నిర్ణయించుకున్నాడు . 
ఆలస్యమెందుకని రంగయ్య బాతును కోసి పొట్ట చీల్చాడు . కాని అందులో ఒక్క బంగారు గుడ్డు కూడా కనిపించలేదు. రంగయ్య నెత్తి నోరూ కొట్టుకొని దురాశ దుఃఖాన్ని కలిగిస్తుందని కృంగి క్రుశించిపోయాడు.

Konga -Chepa Telugu Katha- కొంగ – చేప పిల్ల కథ | Telugu Neethi Kathalu

ఒక ఊరిలో ఒక పెద్ద చెరువు ఉంది. దానిలో చాలా చేపలు ఎంతో కాలంగా నివాసముంటున్నాయి. ఒకరోజు అటు మీదగా ఎగురుతున్న కొంగకి ఆ చెరువు కనిపించింది. ఇంత పెద్ద చెరువుని చూడకుండా ఇంతకాలం ఎలా ఉన్నానా అనుకుని ఆశ్చర్యపోతూ ఆ చెరువు గట్టుపైన వాలింది. దానికి చెరువులో చాలా చేపలు కనిపించాయి. ఇక తన ఆహారానికి ఎలాంటి ఇబ్బంది లేదనుకొని ఆనందంగా అక్కడే కొంత దూరంలో నివాసం ఏర్పరుచుకుంది. ప్రతిరోజూ మూడుపూట్లా హాయిగా చేపలను తింటూ కాలం గడుపుతుంది. ఈలోగా చేపలు కంగారు పడటం ప్రారంభించాయి. ప్రతిరోజూ తమలో కొంతమంది కొంగకి బలైపోవడం చేపలకి భయం కలిగించింది. ఇలా అయితే కొన్ని రోజులకి తామేవ్వరమూ మిగలమని తెలుసుకొని, ఒకరాత్రి చేపలన్నీ కలిసి కొంగ బారి నుండి రక్షించుకొనే ఉపాయం ఆలోచించసాగాయి. ఒక చేపపిల్ల నాకొక ఉపాయం తట్టింది, కాని దానికి మీ అందరి సహకారం కావాలి అని చెప్పింది. ఏమిటది అని మిగతా చేపలు అడిగాయి.

చేపపిల్ల తన ఉపాయాన్ని వాటికి చెప్పింది. ఆ మరుసటి రోజు ఉదయాన్నే చేపల్ని తినటానికి కొంగ చెరువు వద్దకు వచ్చింది. కాని చెరువులో చేపలన్నీ తేలుతూ కనిపించటం చూసి ఆశ్చర్యపోయింది. చూస్తుంటే ఈ చేపలన్నీ చచ్చినట్టున్నాయి, ఏమైఉంటుందో అని ఆలోచించసాగింది. ఇంతలో ఒక చేప నీరసంగా పడుతూ లేస్తూ కనిపించింది. కొంగ ఆనందంగా ఆ చేపను పట్టుకోడానికి ముందుకు వచ్చింది. కాని ఆ చేప కొంగతో నీకు బతకాలని ఉంటే నా మాట విను అన్నది. కొంగ ఆగి ఏమిటో చెప్పు అన్నది. నిన్న రాత్రి ఒక పాము చెరువు దగ్గరకు వచ్చి నీళ్ళు తాగబోయింది. ఈలోగా ఒక పెద్దచేప దానిని కొరికింది. దాంతో కోపం వచ్చిన పాము చెరువులో విషాన్ని కక్కి వెళ్ళిపోయింది. దాంతో చెరువులో నీళ్ళన్నీ విషమయం అయిపోయాయి. అందుకే చేపలన్నీ చచ్చి తేలుతున్నాయి, నేను కూడా ఇంకో క్షణంలో చావబోతున్నాను. నన్ను తింటే నువ్వు కూడా చనిపోతావు జాగ్రత్త అని చెప్పింది. దాంతో భయపడ్డ కొంగ ఇక ఆ చెరువులో తనకి ఆహారం దొరకదని తెలుసుకొని మరొక చెరువును వెతుక్కుంటూ వెళ్ళిపోయింది. చేపపిల్ల పాచిక పారినందుకు చేపలన్నీ ఎంతో సంతోషించాయి.

ముంగిస – పాము-Telugu Neethi Kathalu - Neethi Kathalu

ఒక గ్రామంలో రామ శర్మ అనే పండితుడు ఉండేవాడు. అతని పెరటిలో ఉన్న కుంకుడు చెట్టు క్రింద కలుగు చేసుకుని ఒక ముంగిస ఉండేది. అది రామ శర్మ భార్య పడేసిన చద్ది అన్నం తిని జీవిస్తూ ఉండేది. ఒక రోజు రామ శర్మ ప్రక్క ఊరిలో జరుగుతున్న పురాణ మహోత్సవాలలో పాల్గొనేందుకు వెళ్ళాడు. ముంగిస ఇంట్లోకి వచ్చి సరాసరి మధ్యగది లోకి వెళ్ళి తలుపు మూల చల్లగా ఉండటంతో పడుకుంది. అదే గదిలో రామ శర్మ ఏడాది పిల్లాడు ఉయ్యాలలో నిద్రపోతున్నాడు. రామ శర్మ భార్య వంటగదిలో పనీపాట చేసుకుంటోంది. ఎక్కడి నుంచి వచ్చిందో గాని ఓ పాము ఇంటి పైకప్పులోకి చేరింది. అక్కడ నుంచి ఉయ్యాల నుంచి నెమ్మదిగా ఉయ్యాలలో పడుకున్న పిల్లాడి వైపు రాసాగింది. అదే సమయంలో కళ్ళు తెరిచిన ముంగిస ఉయ్యాల వైపు చుసి పాముని గమనించింది.ఇన్నాళ్ళ నుంచి తనకి అన్నం పెడుతున్న అన్నపూర్ణ లాంటి రామ శర్మ భార్య ఋణం తీర్చుకునే అవకాశం దొరికింది అనుకుంటూ అది ఎగిరి పాముని పట్టుకుని క్రిందకు దూకింది. పాము ముంగిస మధ్య పోరాటం మొదలైంది. చివరికి ముంగిస పాముని చంపింది. ఆ తరువాత అది తను చేసిన పని రామ శర్మ భార్యకు చూపించాలని వంటగదిలోకి వెళ్ళింది నోటి వెంట రక్తంతో ఉన్న ముంగిసను చూస్తూనే అది తన పిల్లాడికి ఏదో హాని తల పెట్టిందని భావించింది. రామ శర్మ భార్య చేతిలో ఉన్న పచ్చడి బండను దాని మీదకు విసిరింది. ఆ దెబ్బకి పాపం మూంగిస చచ్చిపోయింది. ఆ తరువాత వచ్చి ఉయ్యాలలో క్షేమంగా ఉండటం చూసి రామ శర్మ భార్య ప్రక్కనే చచ్చిపడి ఉన్న పాముని చూసి జరిగిన విషయం అర్ధం చేసుకుని అనవసరంగా తొందరపడి మంగిసను చంపినందుకు బాధపడింది.

పేదరాశి పెద్దమ్మ కథ- Pedarashi Peddama Katha- Telugu Neethi Kathalu

పేదరాశి పెద్దమ్మ కథ :
అనగనగా ఒక ఊరు ఉంది. ఆ ఊళ్ళో పేదరాశి పెద్దమ్మ ఉందట. పెద్దమ్మకు నలుగురు కూతుళ్ళు ఉన్నారు. కూతుళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు. వారికి మంచి మనువులు చూసింది. తను దాచుకున్నవి తలోకాస్త ఇచ్చి వేసింది. తన వద్ద మిగిలింది ఏమీ లేదు. తాను బతకాలి కదా! కనుక ఒక్కో కూతురి ఇంట మూడు మాసాలు ఉంటుంది. అల్లుళ్ళు మంచివాళ్ళు దొరికారు. అత్తగారిని బాగా చూసుకుంటారు. ఇలా చాలా కాలం గడిచింది. ఈ ఏర్పాటు బాగానే ఉంది. పెద్దమ్మకు వంట వార్పు పని లేదు. హాయిగా గడచిపోతూంది. ఒకసారి పెద్దమ్మ కూతురు ఇంట్లో మూడు మాసాలు ఉంది. పెద్ద కూతురు అన్నీ వండి పెట్టింది. హుషారుగా ఉంది పెద్దమ్మ. ఒక రోజు రెండవ కూతురు ఇంటికి బయలు దేరింది. కొంత దూరం సాగింది. మధ్యలో అడవి వచ్చింది. అడవి గుండా నడిచి వెళ్ళాలి. పెద్దమ్మ చక చకా నడవసాగింది. అడవి మధ్యకు చేరింది. ఆ అడవిలో ఒక పులి ఉంది. నరవాసన పట్టింది. పెద్దమ్మను సమీపించింది. నిన్ను తినేస్తాను - అంది పులి పెద్దమ్మతో. పెద్దమ్మకు భయం వేసింది.

చెమటలు పట్టాయి. పెద్దమ్మ తెలివైనది. యుక్తి గలది. కాస్త ఆలోచించింది. పులితో ఇలా అంది. పెద్ద పులీ! పెద్ద పులీ! నేను ముసలదాన్నయాను. బాగా చిక్కిపోయాను. ఆరోగ్యం బాగాలేదు. ఇప్పుడు రెండో కూతురు ఇంటికి వెళుతున్నాను. వాళ్ళు బాగా ఉన్నోళ్ళు . అక్కడ పది రోజులు ఉంటాను. రెండవ అమ్మాయి చాలా మంచిది. నా కోసం గారెలు చేస్తుంది. సున్ని ఉండలు చేసి పెడుతుంది. అరిసెలు చేస్తుంది. అన్నీ తింటాను. ఒళ్ళు చేస్తాను. బలిసి వస్తాను. అప్పుడు తిందువుగాని - అంది పెద్దమ్మ. పెద్దపులి పెద్దమ్మ మాటలు నమ్మింది. పెద్దమ్మను పులి అప్పటికి వదిలి పెట్టింది. పెద్దమ్మ రెండవ కూతురు ఇంటికి వెళ్ళింది. పది రోజులు అయ్యింది. పదిహేను రోజులు దాటింది. నెల పూర్తయింది. పెద్దమ్మ మరలా అడవిన రాలేదు. ఎలాగైనా రాకపోతుందా! ఇదే దారి కదా. అప్పుడు పడతా పెద్దమ్మ పని - అని కాచుకొని కూచుంది పులి. పెద్దమ్మ మూడు నెలలు అచట గడిపింది. ఇక బయలుదేర వలసిన పరిస్థితి ఏర్పడింది. అది ఒప్పందం కదా.

బయలు దేరే రోజు దగ్గర పడింది. పెద్దమ్మ రెండవ కూతురిని పిలిచింది. పులితో జరిగిన గొడవ చెప్పింది. పెద్దమ్మ కూతురూ తెలివైనదే. అమ్మను కాపాడాలి. బాగా ఆలోచించింది. ఒక పెద్ద బాన తెచ్చింది. బానలో పెద్దమ్మను కూచో పెట్టింది. మూత పెట్టింది. మూతకు గుడ్డ కట్టింది. దొర్లించి వదిలి పెట్టింది. బాన దొర్లుతూ అడవినబడి పోతాఉంది. బానలోని ముసలమ్మ హుషారుగా ఉంది. పులి నన్నేమీ చేయలేదు - అనుకుంది. "బానా బానా దొర్లు,దొర్లు" అంటూ పాడుకుంటుంది. బాన అడవి మధ్యకు చేరింది. పులి సమీపించింది. పులికి బానలో పాట వినిపించింది. పులికి ఎక్కడలేని కోపం వచ్చింది. బానను కాలితో ఆపింది. పంజాతో గట్టి దెబ్బ కొట్టింది. బాన ఢాం అని పగిలిపోయింది. ముక్కలయింది. పెద్దమ్మ బయటపడింది. భయం వేసింది. నిన్ను ఇప్పుడే తింటాను - అని పులి కేక వేసింది. పెద్దమ్మకు వణుకు పుట్టింది. అయినా ధైర్యం తెచ్చుకుంది. మళ్ళీ కాస్త ఆలోచించి పెద్ద పులీ! పెద్దపులీ!ప్రయాణంలో ఒళ్ళంతా చెమట పట్టింది. నీరసంగా ఉంది. అలసిపోయాను. పక్కనే చెరువు ఉంది. ఆ చెరువులో స్నానం చేసి వస్తాను. అపుడు హాయిగా తిందువుగాని - అంది పెద్దమ్మ. పులి "సరే" అని వదిలి పెట్టింది.


పెద్దమ్మ చెరువులోకి దిగింది. స్నానం చేసింది. బయటకు రాలేదు. గంట అయ్యింది. రెండు గంటలు అయింది. పులికి కోపం వచ్చింది. ఆకలి పెరిగింది. పులి చెరువు ఒడ్డున నిలబడి పెద్దమ్మను పిలిచింది. పెద్దమ్మ పులి మాటలు విన్నది. కాని పట్టించుకోలేదు. ఏమైనా పులి పెద్దమ్మను తినేయాలనుకుంది. పులి చెరువులో దిగింది. పెద్దమ్మను సమీపించింది. పెద్దగా అరిచింది. పెద్దమ్మను చంపేయాలనుకుంది. పంజా ఎత్తింది. పెద్దమ్మ తక్కువదా! ముందే ఆలోచించింది. రెండు గుప్పెట్ల నిండా ఇసుక తీసుకుంది. పులి మీదకు రాగానే పులి కంట్లో ఇసుక చల్లింది. పులి కళ్ళు కనబడలేదు. కేకలు పెట్టింది. చెరువులోనే గిలగిల తన్నుకుంది. ఈలోగా పెద్దమ్మ ఒడ్డుకు చేరుకుంది. అడవిలో నడిచింది. మూడవ కూతురు ఇంటికి చేరుకుంది. కనుక మనం ఉపాయంతో బతకాలి. తెలివిగా మెసలడం నేర్చుకోవాలి. సమయానికి తగిన ఆలోచన చేయాలి. అలా ఉంటే హాయిగా జీవించగలం.

ఏకలవ్యుడు- Eekalavyudu- Telugu Neethi Kathalu
ఏకలవ్యుడు మహాభారతంలో గురుభక్తిని చాటే ఒక గోప్ప ఒక ఔన్నత్యం పొందిన వీరుడు. ఏకలవ్యుడు ఎరుకుల వంశానికి చెందినప్పటికీ ద్రోణాచార్యుని వద్ద విలు విద్యను నేర్చోకోవాలని కోరిక కలిగిఉండేవాడు. అతని తండ్రి హిరణ్యధనుడు. 

        ఒకరోజు ఏకలవ్యుడు తన గురువైన ద్రోనచార్యుని వద్దకు వెళ్లి “ స్వామి నేను మీ వద్ద విలు విద్యను నేర్చుకోవాలని ఉంది.నాకు కూడా విలువిద్యను అభ్యసించమని కోరాడు”. ద్రోణుడు తిరస్కరించడంతో అతని విగ్రహాన్ని ప్రతిష్టించుకొని స్వధ్యానం ప్రారంభించాడు. 

ఎంతో దీక్షతో విలు విద్యను అబ్యాసించిన ఏకలవ్యుడు ద్రోణుడి ప్రియశిష్యుడు. మరియు మేటి విలుకాడైన అర్జునునితో సమానంగా నైపుణ్యాన్ని సాధించగలిగాడు. ఒకసారి విలు విద్య సాధనకు అర్జునుడు, ద్రోణుడు ఇతరులు కలిసి వేటకి వేటకుక్కలను తీసుకెళ్ళారు. అందులోని ఒక కుక్క వేగంగా ఏకలవ్యుడు ఉన్న ప్రదేశానికి వెళ్ళింది. కొత్త వేషదారణతో కనిపించేసరికి కుక్క గట్టిగ అరిచింది. “ నన్ను చూసి అరుస్తావా” అనుకున్న ఏకలవ్యుడు కుక్క నోరుతెరిచి మూయుటకు మధ్యగల సమయంలోనే దాని నోటిలోలినికి ఏడు బాణాలు కొట్టాడు. తరువాత కుక్క అర్జునికి కనిపిచింది. విషయం విచారించగా ఈ ప్రాంతంలో ఏకలవ్యుడు అనే అతను విలువిద్య నేర్చుకుంటున్నాడని తెలుసుకొని రాత్రి ద్రోణాచార్యులు వారికి సేవ చేసే సమయంలో ఇక్కడ నాకన్నా బాగా విలువిద్య చేసే వారు ఉన్నారని తెలిపారు. తరువాత రోజు ద్రోణాచార్యులు ఏకలవ్యుడిని చూడటానికి అతని వద్దకు వెళ్లారు. ఏకలవ్యుడు విలు విద్య చూసి ఎంతో సంతోషించారు. కాని అర్జునుడు మాత్రం కోపం దుఃఖం పొంగుకొచ్చాయి. ద్రోణుడికి అర్జునుడు బాద పడటం సహించలేకపోయాడు. 


గురువును చూడగానే అత్యంత భక్తి ప్రపత్తులతో గురువాజ్ఞా కోసంఎదురుచూస్తూ అయన ముందు మోకరిల్లాడు. ద్రోణుడు ఏకలవ్యుని గురు దక్షణ ఇమ్మని అడిగాడు. ఏకలవ్యుడు అందుకు సంతోషంగా గురువు ఏదడిగినా ఇస్తాన్నాడు. అప్పుడు ద్రోణుడు ఏ మాత్రం కనికరం లేకుండా కుడి చేతి బ్రొటన వేలుని కోసి గురు దక్షిణగా ఇమ్మని అడిగాడు. కాని ఏకలవ్యుడు ఏ మాత్రం బెదరక, సందేహిచక వేను వెంటనే తన కుడి చేతి బ్రొటన వేలుని ఖండించి గురు దక్షిణగా సమర్పిచాడుగాడిద గారం - Gaadida Gaaram- Telugu Neethi Kathalu- Neethi Kathalu


ఒక కుమ్మరివానికి ఒక గాడిద, ఒక కుక్కా ఉన్నాయి. ప్రతిరోజూ ఆ కుమ్మరి గాడిద నడ్డిమీద బోలెడు కుండలు వేసి బజారుకు తీసుకువెళ్ళి అమ్ముతుండేవాడు.త్వరగా నడవాలని దాన్ని దారిపొడుగునా తన్నుతుండేవాడు,కుమ్మరి తనపట్ల దయలేకుండా ఉన్నాడని అది ఎంతో బాధపడేది.

ఒకరోజున గాడిద యింటివద్ద విశ్రాంతి తీసుకుంటు యిట్లా అనుకుంది. “ ప్రతిరోజూ బోలెడన్ని కుండల్ని బజారుకు  మోసుకేళ్తుంటాను . ఎంతో కష్టపడుతున్నప్పటికి యజమానికి నా యందు జాలిలేదు , ప్రేమలేదు .ఎప్పుడూ నన్ను చితకబాదుడు ఉంటాడు. చెడిపోయినవీ,కుళ్ళి పోయినవీ. మిగిలిపోయిన పదార్దాలు నన్నటిని నా ముఖానా పడేస్తాడు. కాని ఈ కుక్కను మాత్రం ఎంతో ఆదరంతోటి అభిమానంతోటి చూస్తాడు. అది ఏ పని చెయ్యక పోయినా దానికి రాచమర్యాదలు చేస్తాడు.దాన్ని మాంసం పెట్టి మేపుతాడు. పాలుతాగించి ఎంతో ముద్దు చేస్తాడు. ఈ వేళా ఒక పని చేస్తా! అది మొరిగినట్లుగా నేనుకూడా మొరుగుతాను. కుక్క అతని పైబడి నాకినట్లుగా నేను కుడా అతణ్ణి నాకుతాను. అప్పుడతను సంతోషించి నిమురుతాడు. ఎంతో ప్రేమ చేస్తాడు” అనుకుంది.
సాయంత్రం అయ్యింది. యజమాని ఇంటికి వచ్చాడు. వెంటనే గాడిద అరుస్తూ అతని దగ్గరగా వెళ్లి తోక ఆడించడం మొదలుపెట్టింది. కుక్కవలె తానుకుడా అతని ముఖాన్ని నాకింది. “ ఇదేంటి ! ఈ గాడిద నా మీదకు వస్తుంది” నన్నేదిరించి పోట్లాడడానికి కాబోలు ! అనుకొని ఆ కుమ్మరి ఒక దుడ్డు కర్రతో ఆ గాడిదను చితకబాదాడు .  


నీతి: నీ ప్రవర్తన నీదిగానే ఉండాలి – ఎవర్ని అనుకరించకుడదు.                            

ఆవు- పులి - aavu-puli -Telugu Neethi Kathalu

అనగనగా ఒక అడవిలో పెద్ద పులికి ఆకిలి వేసి ఆహారం కోసం అడవి అంత కలయ తిరుగుతుంది. ఇంతలో ఒక ఆవు పచ్చికలు మేత మేయ్యడం చూసి ఇక తనకు మంచి ఆహారం దొరికిందని ఆ ఆవు దగ్గరికి వచ్చి తినడానికి సిద్దం అవుతుంది.

                 అంతలో ఆ ఆవు తను చనిపోతే తన లేగా దూడకు ఎవరు పాలిస్తారు. ఉదయం సరిగ్గా పాలు కూడా ఇవ్వకుండా మేతకు వచ్చాను అని మనసులో బాధ పడుతూ పులిని చూసి అయ్యా నేను ఈ మద్యనే ఇనాను. నా పిల్ల ఇంకా నా పాలు త్రాగాతునే ఉంది. అది పాలు త్రాగటానికి నాకై ఎదురు చూస్తూ ఉంటుంది. నా పై దయ ఉంచి నా బిడ్డకు పాలు ఇచ్చి రావటానికి అనుమతి ఇవ్వండి. తప్పకుండా తిరిగి వచ్చి మీకు నేను ఆహారం అవుతానని జాలిగా ప్రాదేయ పడింది.
         ఆవు మాటలు ఎందుకో పులికి నమ్మబుద్ది వేసి సరే! నాకు బాగా ఆకలిగా ఉన్న నీ మీద జాలితో నీకు ఆవకాశం ఇస్తున్నాను. వెళ్లి త్వరగా రా.. అని చెప్పింది. తనకు ఆవకాశం మిచ్చిన పులికి ధన్యవాదాలు తెలిపి ఆవు తన దూడ వద్దకు వెళ్లి దానికి కడుపు నిండా పాలు యిచ్చి మంచి బుద్దులు చెప్పి దాని బాద్యతను తోటి పశువులకు అప్పగించి తిరిగి అడవిలో పులి ఉన్న ప్రదేశానికి వచ్చింది.

         ఆవు నీజాయితిగా తన మాట మీద నిలబడి ప్రాణాలకు కుడా లెక్క చేయకుండా తిరిగి రావడంతో సంతోషించిన పులి నేను బాగా ఆకలితో ఉన్న నీ నీజయితీకి మెచ్చి నిన్ను తనకుండా వదిలి పెడుతున్నాను . వెళ్లి నీ బిడ్డతో హాయిగా జీవించు అని దాన్ని విడిచిపెట్టింది. పులి దయ గుణానికి ఆవి కృతఙ్ఞతలు తెలిపి తన పాకకు పోయి తన బిడ్డతో హాయిగా జీవించ సాగింది.


                     నీతి: మన నీజయితినే మనల్ని కాపాడుతోంది.     

                   


నక్క తెలివి - Telugu Neethi Kathalu- Neethi Kathalu

అడవిలో ఒకచిన్న చేరువులో ఒక మొసలి ఉండేది.ఆ చేరువులో బోలెడన్ని చేపలున్నాయి.వాటిని తింటూ  ఆ మోసలి అక్కడే ఉంటోది. అది ఉన్నదనే భయానికి అక్కడికి ఏ జంతువులు వచ్చేవికావు. ఆ చేరువు దగ్గరలోనే ఒక పీత ఉంటోంది. మొసలికి అది మిత్రుడు.

ప్రతిరోజూ చేపలు తిని తిని మొసలికి వెగటుపుట్టింది.అందుచేత ఏదైనా ఉపాయం చెప్పి , తనకు వేరే ఆహారం ఏదైనాదొరికేటట్లు చూడామని మొసలి పీతతో చెప్పింది. పీత బాగా ఆలోచించి దానికొక సలహాచేప్పింది. “నీవు ఒడ్డుఫైన చచ్చిపోయినట్లుగా పడిఉండు! నేను వెళ్ళి అడవిలోని జంతువులు అన్నింటికి నీవు చచ్చి పోయావని చెప్తాను.ఆ ఫైన జంతువుల్ని యిక్కడకు నీళ్ళు తాగడానికి వస్తాయి.అప్పుడు నీ యిష్టం వచ్చిన జంతువుల్ని పట్టుకొని తింటుండవచ్చు ““ఓహో ! నీ సలహా చాల బాగాగుంది ! “ అంది మొసలి. పీత వెంటనే అడవిలోకి వెళ్లి  “ మిత్రులారా ! చేరువులోని మొసలి చచ్చిపోయింది . మీరింక భయంలేకుండా వచ్చి నీళ్ళు తాగా వచ్చును “ అని చెప్పింది. దాని మాటలు అన్ని జంతువులు నమ్మాయి. కాని వాటిలో ఒక  తేలివైన నక్కమాత్రం నమ్మలేదు. నీతోవస్తాను. నాకు చచ్చిన మొసలిని చూపించు” అని పీత వెనకే వెళ్ళింది. నక్క మోసల్ని చూసి అది చావలేదని ఊహించుకొని, కూడా వచ్చిన జంతువులతో “మిత్రులారా !మోసలి చచ్చిపోయిందని మీరు నమ్ముతున్నారా ? అది తోక కదుపుతున్నట్లు మీరెవరైనా చూశారా ? నాకు ఒక గుడ్లగూబ చెప్పిన ప్రకారం, మొసలి చచ్చిననాసరే దానితోక కదులుతూ ఉంటుందట “అని నక్క గట్టిగా అరచి చెప్పింది.

తెలివిలేని ఆ మొసలి, నక్కమాట విన్నవెంటనే తోక కదల్చడం మొదలేట్టింది. అది బ్రతికే ఉందని, నక్కకు ఇప్పుడర్ధమైంది. “ వెంటనే గట్టిగ “ మిత్రులారా పారిపోండి ! మొసలి చావలేదు. బ్రతికే ఉన్నది” అని అరిచింది. వెంటనే జంతులన్ని అక్కడనుండి పారిపోయాయి.


నీతి: మోసాన్ని మోసంతోనే జయించాలి.           

రైతు – సోమరి కొడుకులు-Raithu Somari Kodukulu | Telugu Neethi Katalu

ఒక ఊర్లో ఒక పేద రైతు ఉండే వాడు. అతనికి ముగ్గురు కొడుకులు. వాళ్లకి కూర్చొని తినడం తప్ప ఏ పని చేతకాదు. వాళ్ళని చూసి ఆ ముసలి తండ్రి నిత్యం కుమిలి పోయేవాడు. ఏ విధంగానైన బుద్ది చెప్పి వాళ్ళని ప్రయోజకులుగా తయారుచెయ్యాలని అనుకున్నాడు.

         ఒక రోజున పేద రైతు తన కొడుకులతో “ నేను ఒక కుండలో బంగారు నాణేలు పోసి మన చేనులో ఒక చోట పాతిబెట్టాను. చాల కాలం అయ్యింది కదా ! నేనవి ఎక్కడ పాతిబెట్టానో మరిచిపోయాను. అందుచేత మీరు చేనునంత బాగా త్రవ్వి ఆ కుండనువెతికి పట్టుకొని రండి! ” అని చెప్పాడు.
         మహా సంతోషంతో  ఆ ముగ్గురూ పొలం దగ్గరికి చేరుకున్నారు. అతి కష్టపడి చేనునంత త్రవ్వి చూశారు. కానీ వాళ్లకి ఆ కుండ కనిపించలేదు. తిరిగి వచ్చి వాళ్ళు ఆ సంగతి తండ్రికి చెప్పారు.

        “ కుండపోతే పోయిందిలే! మీరు కష్టపడి చేనునంత త్రవ్వారు కదా! ఇప్పుడు కొన్ని విత్తనాలను కొని తెచ్చి చేలో చల్లండి” అన్నాడు తండ్రి. “సరే !” అని వెళ్లి వాళ్లు విత్తనాలు కొని తెచ్చి చేలో చల్లారు.
పంట చాల బాగా పండింది. బళ్ల కొద్ది ధాన్యం ఇంటికి చేరాయి. తినడానికి కొన్ని బస్తాలను మిగిల్చి తక్కిన బస్తాలను బజారులో అమ్మవలసినదిగా కొడుకులను పురమాయించాడు రైతు.

ఈ రైతు పుత్రులు ధాన్యం అమ్మగా వచ్చిన మూడువేల రూపాయలను తండ్రికి తెచ్చి ఇచ్చారు. అప్పుడు రైతు కొడుకులతో “ ఇదే నేను చేలోపాతిన సొమ్ము! ఇట్లాగే మీరు ప్రతి సంవత్సరము కష్టపడి పనిచేస్తే మీకు బోలెడంత డబ్బు వస్తుంది. సుఖంగా తిండి తినవచ్చు. నల్గురికి పెట్టవచ్చును” అని చెప్పాడు.

అప్పుడు జ్ఞానోదయ మయ్యింది. రైతు పుత్రులకు అప్పటి నుండి ప్రతి సంవత్సరము వాళ్ళు కష్టపడి పంటలు పండించి గొప్ప ధనవంతులయ్యారు. 


                          నీతి: కష్టపడితేనే ఫలం దక్కేది                           


                                       

ఏనుగు – దర్జీవాడు- Telugu Neethi Kathalu

ఒక ఊళ్ళో రహీమ్ అనే దర్జీవాడు ఉండేవాడు .అతడు దుస్తుల్ని చక్కగా కుట్టేవాడు. అందుచేత అతని దుకాణమెప్పుడూ  జనంతో రద్దీగా ఉండేది .ఆ ఊళ్ళో పెద్దదేవాలయం  ఉంది. ఆ దేవాలయానికి ఒక ఏనుగు ఉంది. దానిఫై దేముళ్ళను బెట్టి పండుగ ,దినాలలో ఊరేగించేవారు.

                 ఆ ఏనుగు ప్రతిరోజు నదిలో స్నానం చేయడానికి రహీమ్ దుకాణం ముందునుండే వెళ్తుండేది. రహీమ్ కు ఆ ఏనుగుతో చనువు ఏర్పడింది. ప్రతిరోజు దానికి ఏదో పండుగాని, చెరుకు ముక్క గాని పెడుతుండేవాడు. అది అలవాటుగా మారి వేళా తప్పకుండా ప్రతిసారి వచ్చి అతని దుకాణం ముందు నిలబడేది. ఏదోఒకటి అతను యిచ్చిన తర్వాతనే అక్కడినుండి వెళ్ళేది.                 ఒకరోజున రహీమ్ తనఖతాదారులు ఎవరితోనో గొడవపడ్డాడు. ఆ రోజు అతని మనస్సు ఏమి బాగోలేదు. పాపం! దానికి ఆ తెలియవుకదా! ఏనుగు మాత్రం మామూలుగా వచ్చి నిలబడింది. ఎంతసేపైన రహీమ్ దానికేది పెట్టలేదు. తనను చూడలేదోమోనని ఏనుగు ఒకసారి పెద్దగా ఘీంకరించింది. దాని అరుపుకు చికాకుపడి రహీమ్ తన చేతిలోని సూదితో దాని చేవిమీద గుచ్చేడు. దానికి చాల బాధ అన్పిచింది. ఆ బాధతో అది వెంటనే అక్కడ నుండి వెళ్ళిపోయింది.

                 నదిలో స్నానం చేస్తూ రహీమ్ కు బుద్దిచెప్పడానికి ఒక ఆలోచన చేసింది. తన తొండం నిండా మురికి నీళ్ళను పీల్చుకొని రహీమ్ షాపు వద్దకు వచ్చింది. వెంటనే ఆ బురద నీటిని అక్కడ ఉన్న కొత్త బట్టల పైనా , రహీమ్ పైనా కూడా కుమ్మరించి వెళ్ళిపోయింది.

                 తాను చేసిన పనికి దానికి కోపం వచ్చిందని గ్రహించాడు రహీమ్. ఆ రోజు తరువాత నుండి మరల ఆ ఏనుగుతో స్నేహం పెంచుకోవాలని ఎన్నో విధాల ప్రయత్నాలు చేసాడు.అరటిపండ్లు, చెరుకుముక్కలు మొదలైనవి ఎన్నోపెట్టిన అది మాత్రం అతని స్నేహాన్ని ఇష్టపడలేదు. “ చక్కటి స్నేహాన్ని చేతులారా పాడు చేసుకున్నాను” అని రహీమ్ తరుచు బాధపడేవాడు.
 
                       నీతి : అమాయకుల పై ప్రతాపం చూపరాదు. 

తోడేలు- కొంగ - todelu-konga-Telugu Neethi Kathalu

ఒకరోజున ఒక తోడేలు గొంతుకలో ఒక ఎముక అడ్డుపడింది. ఎన్ని విధాల ప్రయత్నించిన అ ఎముక మాత్రం బయటికి రావటంలేదు. ‘’ఈ ఎముక ముక్క బయటికి రాకపోతే నేను తిండి లేక మలమల మాడి చావాల్సి వస్తుంది”.అనుకుంటూ చెయ్యి నోటిలోనికి బాగాలోతుగా పెట్టి ప్రయత్నం చేసి చూసింది. కాని ఫలితం లేకపోయింది.                 ఇంతలో ఎదురుగా ఒక కొంగ కనిపిచింది. “కొంగ తన పొడవాటి ముక్కుతో ఆ ఎముక తీసి వేయగలదు. దాన్ని ఎట్లాగైనా బ్రతిమాలి ఒప్పిస్తాను”.అనుకొని అది కొంగ దగ్గరగా వెళ్లి “ కొంగ బావా! నా గొంతులో ఒక ఎముక అడ్డుపడింది. దాన్ని తీసిపెట్టావా! నీకెంతో పుణ్యం ఉంటుంది. నీకు ఒక మంచి బహుమతి కూడా ఇస్తాను” అంది. “ పోనిలే పాపం! ఎంతో బాధ పడ్తోంది. కొంచెం సహాయం చేస్తే నష్టం మేమి లేదు” అనుకొని, కొంగ దాన్ని గొంతులో నుండి ఆ ఎముకముక్కను మెల్లగా తీసివేసింది. “ బావా! నీకు ధన్యవాదాలు. ఇప్పుడు నాకు చాల ఆకలిగా ఉంది. పోయి ఏదైనా తినివస్తాను” అంది. మరి నా బహుమతి మాటేమిటి ?” అని అడిగింది కొంగ. “ బహుమతా! నీకా! అట్లాంటిది ఏది ఇస్తానని నేను ప్రమాణం చెయ్యలేదు” అని చెప్పేసి తోడేలు ఒక్క ఉదుటున పారిపోయింది.


                       నీతి : మోసకారుల మాటలు నీటిలోని మూటలు.  

తోడేలు – మేకపిల్ల - Neethi Kathalu

ఒకనాడు అడవిలో ఒక చిన్న మేకపిల్లకు  దాహంవేసింది .అది దగ్గరలోనున్న ఏరుదగ్గరకు పోయి నీళ్ళుత్రాగుతుంది. సరిగ్గా అప్పుడే ఒక తోడేలు కూడా దాహంతో అక్కడికివచ్చి నీళ్ళు త్రాగుతుంది .మేకపిల్లను చూడగానే దానికి నోట్లో నీరు ఊరడం మొదలైంది ‘’ఎలాగైనా దీన్నిచంపి ,ఆ మాంసంతో యీరోజుపండుగ చసుకోవాలి ‘’అనుకుంది తోడేలు .

అది మేకపిల్లతో ‘’ఎవతేవేనివు ? నేనుతాగే నీళ్ళని ఎంగిలిచేస్తున్నావు ?’’ అంది. అప్పుడా మేకపిల్ల ‘’మీరు ఏటికి ఎగువలోనున్నారు .నేను దిగువన ఉన్నాను. మీఎంగిలినిరే  నాకువస్తుంది కానీ నానీరు మీకురాదు’’అంది.
‘’ఎంతదైర్యమే నీకు !నాతో వదిస్తున్నావా ?అయితే మూణ్ణేల్ల క్రితం నన్నేదిరించిన పోగారుబోతువు  నివేనన్నమాట ‘’అంది తోడేలు.

అయ్యా ?నేను పుట్టి మూడువారాలే అయ్యింది .నన్ను మూడునేలలక్రితం తమరు ఎట్లా చూశారు ?’’అంది మేకపిల్ల.

‘’అయితే అది మీ పొగరుబోతు తల్లికావచ్చు.ఎవరుచేసిన  నేరం నేరమే ! నిన్నుయిప్పుడు చంపి తిని, మీ అమ్మను శిక్షిస్తా” అని ఒక్కదూకు దూకి మేకపిల్లఫైన బడిదాన్ని చంపి తినేసింది.  


                            నీతి:  అబద్దాలాడే వాళ్లకి అన్ని సాకులే  

అత్యాశ - Athyasha

ఒకరోజున ఒకకుక్క బజార్లో పోతుంటే దానికి ఒక మంసంముక్క దొరికింది . దానికి చాల ఆకలిగా ఉంది . కానీ అక్కడే తినడం దానికి నచ్చలేదు .’’హాయిగా కాలువ ఆవలి ఒడ్డుకుపోయి, ఎవరులేనిచోట తింటాను” అనుకోంది. కాలువ మీదానున్న చిన్నవంతెన దాటి ఆవలి వేపుకు పోతూపోతూ నీళ్ళలోకి చూసింది . అక్కడ ఒక కుక్క దాని నోట్లోకూడా మాంసంముక్క కన్పించాయి. అది తన నీడ అని దానికి తెలియదు.
                           “అబ్బ! ఆ మాంసం ముక్క ఎంతబాగుందో ! ఆ  ముక్కకూడా  నాకు వస్తే  నాకు  రెండముక్కలుంటాయి . హాయిగా  తినవచ్చు ! నేను  గట్టిగ  మొరిగితే  ఆ కుక్కహడలి పోయి ,ఆ మాంసాన్ని వదిలేసి పరిపోతుంది ‘’అనుకొని భౌ ! భౌ ! అని అరిచింది .ఇది మొరిగితే ఆ కుక్క (నోరు పెదపలేదు ) జవాబుగా ఏమీ మొరగలేదు .కానీ ఒకచప్పుడు మాత్రం విన్పిచింది .అది కుక్క నోట్లోని మాంసంముక్క నీళ్ళలోపడిన చప్పుడు.

               ‘’అయ్యో ! లేనిదాన్ని నమ్మి ఉన్నది కూడా పోగొట్టుకోన్నానే" అంటూఏడుస్తూ కూర్చుంది .

                                  నీతి : లేనిదానికి ఏడిస్తే ఉన్నది కూడా పోతుంది 

బుద్ది హీనులు- Buddiheenulu

  ఒకనాడు ఒక రైతు  తన  కుమారునితో  కలసి  బజారుకు వెళ్ళాడు. అంతా  తిరిగినా వాళ్ళకు  నచ్చిన  వస్తువెదీ  అక్కడ దొరకలేదు . చిట్టచివరకు  వాళ్ళు  గుర్రాల వద్దకు వెళ్ళారు  అక్కడ  ఒక  నల్లగుర్రం  రైతుకు బాగానచ్చింది . కొడుకు  గూడా  ఒప్పుకొన్నమీదట . వాళ్ళు ఆ  గుర్రాన్ని  కొన్నారు  దానితో బాటుగా  కొంతదూరం  నడిచే సరికి  వాళ్ళకి నీరసం వచ్చింది . అందుచేత  వాళ్లిద్దరు గుర్రమెక్కి ఇంటికి పోసాగారు. దారిలో, వాళ్ళన్ని చూచి కొందరు “ఆహ! ఎంత చక్కని గుర్రము కాని పాపం అది ఎందుకో విచారంగా ఉంది. పోతుల్లాంటి ఇద్దరు మనషుల్ని అది మోయలేక పోతోంది కాబోలు అన్నారు”.                         ఆ మాటలు విన్న తండ్రి  కొడుకులకు  చాల  సిగ్గనిపించింది.  కుమారుణ్ణీ గుర్రంపై కూర్చోబెట్టి తాను ప్రక్కన్న నడుస్తున్నాడు రైతు. మద్యలో వారొక బజారు గుండా పోవలసి వచ్చింది. అక్కడి జనం వీళ్ళని చూచి “ కొడుకెంత దుర్మార్గుడో! ముసలి తండ్రి నడిచి వస్తుంటే తానెమో హాయిగా గుర్రం పై ఎక్కి కూర్చున్నాడు. ఎంతసిగ్గు చేటు” అన్నారు. వెంటనే కొడుకు క్రిందకు దిగి తండ్రిని గుర్రం ఎక్కించాడు. ఊరి చివర ఒక చేరువు దగ్గరకు వచ్చే సరికి అక్కడ కొంతమంది ఆడవాళ్ళూ కుర్చుని ఉన్నారు. వారు వీళ్ళని చూచి “ మోసలివవాడెంత  దుర్మర్గుడో   పాపం  పసివాడు !  కొడుకును  ఎండలో  నడిపిస్తూ తాను  హయిగా గుర్రంఫై  స్వారీచేస్తున్నాడు’’ అన్నారు. వారి మాటలకు  సిగ్గుపడి  తండ్రి  కూడా గుర్రందిగి  నడవసాగాడు. వాళ్ళకు   ఈ గుర్రంతో  చాల  అవమానం  కలిగి ఎట్లాగైన  ఆ గుర్రాన్ని  వదిలించుకుంటే  బాగుంటుందనే  నిర్ణయానికి  వచ్చారు.  

అట్లాముందుకు  పోతుండగా  వారొక  నదిపై  వంతెన  దాటవలసి  వచ్చింది .వంతెనఫైకి  రాగానే యిద్దరు  కలసి  గుర్రాన్ని  నదిలోకి  తోసివేశారు .అది పూర్తిగా  మునిగిపోయిన తర్వాత ‘’హమ్మమ్య ! ఈ గుర్రoపీడ  వదిలింది ‘’అనుకొని  యిద్దరూ  ఆనందంగా  యింటికి చేరుకున్నారు . వారికీ  సొమ్మనష్టపోయమనే చింతేలేదు .

                         నీతి:  చెప్పుడు  మాటలు  విని  చెడిపోకు 

చిన్నారి స్నేహం

సింహం – చిట్టెలుక- simham-chitteluka-Telugu Neethi Kathalu

ఒక  రోజున  అడవిలోని  చెట్టు  నీడలో  ఒక  సింహం  నిద్రిస్తోంది  ఆప్రక్కనే  ఉన్న కన్నంలో  ఒక  చిట్టెలుక  ఉంటోంది . అది  బయటికి వచ్చేసరికి పీచులాంటి  మెత్తని గడ్డి  లాంటిది  ఏదో  అక్కడకుప్పలాగ  పడిఉంది . దానిఫైకి  ఎక్కి  ఆడుకొoటే  మజాగా  ఉంటుంది  అనుకొని ఆ  ఎలుక  దానిఫైకి  ఎక్కి సంతోషంగా  ఎగురుతోది .  కానీ  అది  ఎక్కినది  సింహంఫైకి  -అంతేగాని  గడ్డికాదు.  వెంటనే  సింహానికి మెలుకువ  వచ్చిoది .ఒక్కసారి  గట్టిగా గర్జిoచింది .అటు ఇటువెదకగా  దాని  చేతికి  చిట్టెలుక  చిక్కింది .దాన్ని  పంజాతో   ఫైకెత్తి  పట్టుకొని  “ఎలుకముండా ! నీకెంత ధైర్యమే!  నా నిద్రనంతా  పాడుచేశావు . నిన్ను చంపేస్తాను” అంది  సింహం.                            
                  భయంతో ఎలుక   గడా గడా వణికిపోతూ “క్షమించండి మహప్రభో! నేను మిమ్మల్ని చూడలేదు. ఏదో గడ్డి కదా అని ఎక్కి ఆడుకుంటున్నాను. దయచేసి నన్ను వదిలేయండి. నేను ఎప్పుడో ఒకప్పుడు నీకు సాయం చేసి ఋణం తీర్చుకొంటాను” అంది.

                             “ చుస్తే వేలడంతలేవు! నీవు నాకేం సాయం చెయగలవు ? సరేలే! నిన్నిప్పుడు దయతలచి వదిలేస్తున్నా. జాగ్రతగా వుండు!” అని సింహం దాన్ని వదిలేసింది.

                            ఒకనాడు ఆ అడవిలో ఒక వేటగాడు ఒక వలపన్ని ఉంచాడు. పొరపాటున సింహం ఆ వలలో చిక్కుకొంది. ఏమి చెయ్యలేక దినంగా అరవడం మొదలు పెట్టింది. దాన్ని రక్షించడానికి ఎవ్వరు రాలేదు. అప్పుడే కన్నంలోంచి బయటకి వచ్చిన ఆ చిట్టేలుకకు ఆ సింహం అరుపు విన్పించింది. అది సింహం గొంతును గుర్తుపట్టి ఒక్క పరుగున అక్కడికి చేరుకొని , “మహారాజ! భయపడకండి. నేను మీకు సహాయం చేస్తాను” అంది. అటు ఇటు చూసింది వేటగాడు దగ్గరలో ఎక్కడ లేడు. వెంటనే వెళ్లి వల తాళ్ళను ముక్కలు ముక్కలుగా కోరికి పారేసింది. సింహం ఆనందంగా బయటికి వచ్చి చిట్టెలుకను ఒక్కసారి ఫైకెత్తి ముద్దాడి వదిలిపెట్టింది.

                    నీతి: సహాయం చెయడాన్కి చిన్న పెద్ద అనే తేడ లేదు.

రామలింగని తెలివి- తెనాలి రామకృష్ణ - Telugu Neethi Kathalu

                               రామలింగని తెలివి

విజయనగర  సామ్రాజ్యంలో  వికటకవిగా  ప్రసిద్ది చెందిన తెనాలి  రామలింగుని గూర్చి  విననివారు  వుండరు . హాస్యము  అతని  సొత్తు!

ఆ రాజ్యంలోని  ఒక  ఊరిలో ఒక ముసలమ్మా  నివసిస్తూ ఉండేది .ఒక రోజున  ముగ్గురు దొంగలు  ఆమె వద్దకు వచ్చి‘’అవ్వ  మేము యాత్రికులము  చాలదూరం ప్రయాణం చేయుటచే    బాగా అలసి పోయి  ఉన్నాము  .దయతో మాకొక  గదిని అద్దెకు ఇస్తే  యిక్కడ  విశ్రాంతి   తీసుకొంటూ  కొన్నాళ్ళు  ఉంటాము"  అన్నారు .

     ఆమె  అంగీకారంతో   వారాఇంటిలో   నివసించసాగారు.  ఒకరోజున   వాళ్ళు   బంగారునాణెములతో నున్న  కుండనొకటి  తెచ్చియిచ్చి దాన్ని భద్ర్రంగా  చూడవలసినదని  ఆమెకు  చేప్పారు . ఆమెకు అనుమానం  వచ్చి  ఇంత సొమ్ము  మీకెక్కడిది  మీరు దొంగల  అని అడిగీంది, కాదు  మేము  యాత్రికులము ప్రతి రాత్రీ  మేము  దేవాలయాల  వద్ద  అనేక భక్తిగీతాలు  పాడుతూ.జాగరణలు  చేసేవారికి  తోడుగా  ఉంటాము . వాళ్ళు మాకు కానుకగా యి బంగారు నాణేలను ఇస్తుంటారు. మేము నల్గురమూ కలసి వచ్చి  అడిగినప్పుడు మాత్రమే ఈ కుండను మాకివ్వాలి. అట్లా చేస్తానని నీవు మాకు ప్రమాణం చేసి చెప్పు అన్నారు. అందులకు ఆమె అంగీకరించింది. 
                    ఒకరోజున  వాళ్ళు ఇంటికి తిరిగి వస్తుండగా దారిలో ఏవో తినుబండారాలు, పళ్ళు కన్పించాయి. ఆ రోజు వాళ్ళ వద్ద పైకం మేమి లేదు. మరి అవి ఎట్లా కొనుక్కోవాలి. అవ్వ ఇల్లు దగ్గరలోనే ఉంది. అందుచేత వారిలో ఒక్కణ్ణి పోయి కుండను తీసుకు రమ్మని చెప్పారు. వెళ్ళిన వాడు కుండనిమ్మని అడిగితె ఆ అవ్వ గట్టిగ “కుండను ఇతనికి ఇవ్వవచున్న ? “ అని కేక వేసింది. ఆమెకు సమాదానంగా మిగితా ముగ్గురు “ఆ! ఇవ్వవచ్చు” అన్నారు. వెంటనే ఆమె వచ్చిన వానికి కుండనిచ్చింది. ఆ వాడు దురాశపరుడు. ఆ నాణాల కుండతో ప్రక్క దోవన ఎక్కడికో పారిపోయాడు.
ఎంతసేపటికి  అతడు రాలేదని మిగిత ముగ్గురు అవ్వ వద్దకు వెళ్లి “ అవ్వ! కుండ ఏది?” అని అడిగాడు. వచ్చిన వాడికి కుండను ఇవ్వవచున్నని అరిచి చెప్పారు కదా! అందుచేత కుండను వానికి ఇచ్చాను అంది.
దానికి ఆ ముగ్గురు దొంగలు నానా రభస చేయసాగారు. “ముసలమ్మా దొంగది. మా సొమ్మంత దొంగలించింది” అని అరవ సాగారు. ఆ గోడవకి చుట్టూ ప్రక్కల వారు అనేక మంది పోగయ్యారు. ఎవ్వరు ఏమి చేయలేక పోతున్నారు . అదే సమయంలో రామలింగడు ఆ దారి గుండా పోతూ వీరి గోల విన్నాడు. ఆసమయంలోనే  ప్రాతః కాల వ్యాయామం చేస్తూ  వెళ్తున్న మహారాజు కూడా అక్కడకు రావడం సంభవించింది. ఆయనకు రామలింగడు జరిగినదంతా వివరించి “అవ్వను దూషించడం మంచిది కాదు. అవ్వ నిజయితీపరురాలు. మోసకారి కాదు!” అన్నాడు.

Related image


“ఐతే, ఆమె నిర్దోషి యని నీవే నిరుపించి చూపించు” అని రామలింగని రాజు గారు అజ్ఞాపించాడు. రామలింగడు ఆ ముగ్గుర్ని ప్రక్కకు పిలిచి, జరింగినదంతా చెప్పండి అని అడిగాడు.

అంతా విన్న రామలింగడు “ ఈ అవ్వ దోషి కాదు. ఆమె అబద్దమాడుట లేదు. మీరు నలుగురు ఉన్నపుడు మాత్రమే ఆమెను కుండనిమ్మని చేప్పారు కదా ? ఇప్పుడు మీరు ముగ్గురే ఉన్నారు! మీకు ఈమె కుండనేట్ల ఇస్తుంది ? అని అడిగాడు. ఏం జవాబు చెప్పాలో వాళ్లకి తోచలేదు. వాళ్ళని నీలదీసిన మీదట, తాము కూడా దొంగలమేనని వాళ్ళు ఒప్పుకున్నారు.

రామలింగని తెలివికి రాజు గారు సంతోషించి న్యాయాధికారిగా నియమించారు. ముగ్గురు దొంగల్ని బందించి చెరసాలలో బెట్టారు.   
    

             

మంచి స్నేహం- Manchi Sneham- Telugu Neethi Kathalu                             మంచి స్నేహం 


                ఒకప్పుడు ఒక  చెట్టు మీద ఒక పావురం ఉంటుండేది. దానికి కోడి పుంజుకు మంచి స్నేహం ఉండేది. ఆ పుంజు దగ్గరలో ఉన్న పూలతోటలో ఉండేది. అవి ప్రతి సాయంత్రం కలుసుకొని సరదాగా కబుర్లు చెప్పుకొనేవి.     

                     ఒకరోజు చాల ఆకలితో ఉన్న తోడేలు ఆ పులతోటలోకి వచ్చింది. తినడానికి అక్కడ ఏమైనా దొరుకుతుందేమోనని వెదుకసాగింది. ఇంతలో దానికి కోడిపుంజు కనిపించింది. " ఈ కోడి బాగా బలిసి ఉంది ఎట్లైనా చంపితినాలి" అనుకొంది.మెల్లగా వెళ్లి అమాంతం కోడి పుంజుని పట్టుకొని తన సంచిలో వేసికొని పారిపోసాగింది.కోడి భయంతో సంచిలో నుండే అరుస్తుంది. చెట్టు ఫై నున్న పావురం జరిగినదంతా చూసింది . వెంటనే ఒక ఉపాయం ఆలోచించింది.  

                        Image result for HEN AND DOVE STORY

                    తోడేలు కంటే ముందుగా ఎగిరివెళ్లి అది పోయే దారిలో చచ్చిన దానిలాగా పడుకోంది.దారిలో పడిఉన్న ఆ పావురాన్ని తోడేలు చూసింది. " ఆహా! ఏమి అదృష్టం నాది! ఒక కోడి , ఒక పావురం దొరికాయి. ఇవ్వాళ మంచి విందు భోజనం చేస్తాను" అనుకొంది. చేతిలో ఉన్న సంచిని  క్రిందికి పెట్టి పావురాన్ని తీద్దామని దాని దగ్గరకు వెళ్ళింది. " మంచి సందు దొరికింది అనుకోని" కోడి వెంటనే సంచిలోకి బయటకి వచ్చి, ఆ సంచిలో  ఒక రాయిని పెట్టి తాను వెళ్లి ప్రక్కనే ఉన్న పొదలో దాక్కుంది.

               తోడేలు పావురాన్ని పైకి తీద్దామని వంగింది. ఈ లోగా తుర్రుమని ఎగిరిపోయింది! " ఓసి దొంగ పావురమా ! ఎంత మోసం చేశావే" అనుకొంటూ సంచిని భుజాన వేసుకొని ఇంటికి చేరింది. ఆ రోజుకు కోడితోనే సరిపెట్టుకుందామని సంచి తెరచింది. " కోడి రాయిలాగా ఎలా మారిందబ్బా" ఇప్పుడు నేనేమి తినాలి, అనుకొంటూ ఏడుస్తూ కూర్చుంది. 

            కోడి , పావురము ఒక చోట కూర్చొని తోడేలు తెలివి తక్కువ తనానికి నవ్వుకున్నాయి.